LIC: ఆసుపత్రి ఖర్చులతో సంబంధం లేకుండా.. పరిహారం
ఈనాడు, హైదరాబాద్: ఆరోగ్య అత్యవసర స్థితి ఏర్పడినప్పుడు/ ఏదేని తీవ్ర వ్యాధి సోకినప్పుడు ఆర్థికంగా అండగా నిలిచేలా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఆరోగ్య రక్షక్ పేరుతో కొత్త వైద్య బీమా పాలసీని ఆవిష్కరించింది. సోమవారం హైదరాబాద్ ఎల్‌ఐసీ జోనల్ కార్యాలయం నుంచి జరిగిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఈ పాలసీని దక్షిణ మధ్య జోన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక) జోనల్ మేనేజర్ ఎం.జగన్నాథ్ విడుదల చేశారు. వ్యక్తిగతంగానూ, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఒకే పాలసీని తీసుకునే వీలుంటుంది. 18-65 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పిల్లల వయసు 91 రోజుల నుంచి 20 ఏళ్లలోపు ఉండాలి. 80 ఏళ్ల వయసు వచ్చేదాకా ఈ పాలసీ కొనసాగుతుంది. అనారోగ్యం, పాలసీలో పేర్కొన్న నిర్ణీత వ్యాధుల బారిన పడినప్పుడు ఆసుపత్రి ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీ విలువ మేరకు ఒకేసారి ఈ పాలసీ పరిహారం చెల్లిస్తుంది.
Tags :
మరిన్ని