comparemela.com


TS News: ఏడు జిల్లాల్లో తగ్గని ఉద్ధృతి
అక్కడి 150 గ్రామాల్లో విజృంభిస్తున్న కొవిడ్‌
స్థానిక వైఫల్యంపై ఆరోగ్యశాఖ మండిపాటు
కొందరు అధికారులపై కఠిన చర్యలకు నిర్ణయం
ముఖ్యమంత్రికి తాజా నివేదిక
ఈనాడు- హైదరాబాద్‌: రాష్ట్రమంతటా కొవిడ్‌ తగ్గుముఖం పడుతుంటే.. 7 జిల్లాల్లో మాత్రం వైరస్‌ ఉధ్ధృతి తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో మొదట్నించి అత్యధిక కేసులు నమోదవుతూ వస్తోన్న జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ ప్రస్తుతం కేసులు నియంత్రణలో ఉండగా.. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మాత్రం వైరస్‌ వీరవిహారం చేస్తోంది. ఈ జిల్లాల్లోని 150 గ్రామాల్లో కొవిడ్‌ పంజా విసురుతున్నట్లుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. వైద్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ నేతృత్వంలో ఇటీవల జిల్లాల్లో హెలికాప్టర్‌ ద్వారా సుడిగాలి పర్యటన చేసిన వైద్య అధికారుల బృందం కీలక అంశాలను గుర్తించింది. ‘‘ముఖ్యంగా కొన్ని మండలాలు, గ్రామాల్లో వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉందని.. వైరస్‌ జాడలను ఎప్పటికప్పుడూ పసిగడుతూ.. నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుకుంటూ.. అవసరమైన నియంత్రణ చర్యలను చేపట్టడంలో స్థానిక అధికారులు వైఫల్యం చెందినట్లు’’ కనుగొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభావిత పల్లెల్లో వేర్వేరుగా క్షేత్రస్థాయి శాస్త్రీయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టడంలో విఫలమైన కొందరు అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ 7 జిల్లాల్లో పరిస్థితి, నియంత్రణ చర్యలపై ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది.
విజృంభణకు గుర్తించిన కారణాలు
* ఖమ్మం జిల్లా కేంద్రంలో.. పరిసర ప్రాంతాలైన తిరుమలాయపాలెంలో వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కేసుల పెరుగుదలను త్వరితగతిన గుర్తించకపోవడం, అందుకు తగ్గట్లుగా నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం.
* మహబూబాబాద్‌ జిల్లా గార్ల, కొత్తగూడ, కోమట్లగూడెం, ఉగ్గపల్లి గ్రామాల్లో కరోనా నిర్దారణ పరీక్షలను వేగంగా, అధికంగా నిర్వహించడంలో వైఫల్యం.
* వరంగల్‌, హన్మకొండ, కమలాపూర్‌ ప్రాంతాల్లో జన సంచారం పెరగడం, మాస్కులు ధరించకపోవడం.
* కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, వీణవంక ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో రాకపోకలు కొనసాగించడం.
* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, జైపూర్‌, నస్పూర్‌, చెన్నూర్‌ ప్రాంతాల్లో తక్కువ పరీక్షలు చేయడం..సింగరేణి కాలరీస్‌ యాజమాన్యంతో జిల్లా వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయకపోవడం.
* పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, గారెపల్లి, కమాన్‌పూర్‌, ఓదెల, శ్రీరాంపూర్‌, అల్లూర్‌లో ఆశించిన రీతిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. ఇక్కడ కొత్తగా నెలకొల్పుతున్న విద్యుత్తు కర్మాగారం కోసం కార్మికుల రాకపోకలు.
* రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడల్లోనూ పరీక్షలు తక్కువగా నిర్వహించారు. ఇక్కడికి దైవదర్శనానికి భక్తుల రాకపోకలు పెరగడం.
* ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతం కావడంతో నల్గొండ జిల్లా హాలియా, త్రిపురారం, పెద్దవూర గ్రామాల్లో రాకపోకలు ఎక్కువగా ఉండటం.
* మిర్యాలగూడ చుట్టుపక్కల గ్రామాలైన అల్లగడప, వేమునాలపల్లి, దామరచర్లలో రైస్‌ మిల్లులతోపాటు ఇక్కడ నిర్మిస్తున్న విద్యుత్తు కర్మాగారంలో పనులకు ఎక్కువమంది కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి నిత్యం రాకపోకలు కొనసాగించడం.
* నకిరేకల్‌ పరిధిలోని పొనగల్‌, ఒగుడు, రాములబండ, మంచెర్లగూడ ప్రాంతాల్లో జాతర, పెళ్లిళ్లు.
* సూర్యాపేట జిల్లాలో వ్యాపార నిమిత్తం రాకపోకలు ఎక్కువగా కొనసాగుతుండటం.
ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు
-డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు
ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో వైద్య ఉన్నతాధికారులను 7 జిల్లాల్లో పర్యటనకు హెలికాప్టర్‌లో పంపించారు. ఈ జిల్లాల్లోనూ ఒక్కో జిల్లాకు ఒక ప్రత్యేక నోడల్‌ అధికారిని ఏర్పాటు చేశాం. వారు స్థానికంగా ఉంటూ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తూ.. మార్గనిర్దేశం చేస్తుంటారు. ప్రభావిత ప్రాంతాల్లో నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాం. టీకాలను పెద్దసంఖ్యలో ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ప్రతి కొవిడ్‌ బాధితుడికి సంబంధించి కనీసం 25 మంది కాంటాక్టు వ్యక్తులను తక్షణమే గుర్తించి, పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలిచ్చాం. ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ రోజుకు కనీసం 300 వరకూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నాం. ఇంటింటి జ్వర సర్వేను ముమ్మరం చేశాం. త్వరలోనే ఈ ప్రాంతాల్లోనూ కొవిడ్‌ను నియంత్రణలోకి తీసుకొస్తామని విశ్వసిస్తున్నాం.
Tags :

Related Keywords

Peddapalli ,Andhra Pradesh ,India ,Nalgonda ,Khammam ,Suryapet ,Singareni , ,Posco ,District Center ,Khammam District ,District Bellampalli ,District Doctors ,Peddapalli District ,Region As Nalgonda District Halliya ,பெட்தாபபல்ளி ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,நல்கொண்டா ,கம்மம் ,சூர்யாபேட்டை ,சிங்கறெநீ ,பொஸ்கோ ,மாவட்டம் மையம் ,கம்மம் மாவட்டம் ,பெட்தாபபல்ளி மாவட்டம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.