comparemela.com


అన్నదాతకు ఆసరా.. భారీగా ఉపాధి కల్పన
రూ. 25 వేల కోట్ల పెట్టుబడులు
రూ. 3.70 లక్షలమందికి భరోసా  
ఆహారశుద్ధి పారిశ్రామిక విధానానికి మంత్రిమండలి ఆమోదం
ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రూ. 25,000 కోట్ల పెట్టుబడుల సాధన, 70 వేలమందికి ప్రత్యక్షంగా.. 3 లక్షలమందికి పరోక్షంగా ఉపాధిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆహారశుద్ధి పారిశ్రామిక విధానానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నీటి లభ్యత పెరగడంతో వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి, మత్స్య రంగాలలో రైతులు, ఇతర వర్గాలకు లబ్ధి, నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి లక్ష్యంతో రాష్ట్రంలో పెద్దఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచించింది. కొత్త విధానం వల్ల ఆహారశుద్ధి మండలాల్లో అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, ఉపాధి అవకాశాల వల్ల వెనకబడిన ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందుతాయని పేర్కొంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహకంగా ఉంటుందని తెలిపింది. వ్యవసాయ రంగంలోసాంకేతికతను, నైపుణ్య పెంపుదలకు ఊతమిచ్చేలా ఈ విధానాన్ని అమలుచేయాలని అధికారులను ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొదటిదశలో కనీసం 10 ప్రత్యేక మండళ్లను ఏర్పాటుకు అనుమతించింది. 2024-25 సంవత్సరం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10,000 ఎకరాల్లో వీటిని స్థాపించేందుకు కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు రాయితీలు, ప్రోత్సాహాలు అందించాలంది. ప్రభుత్వమే భూమి సేకరించి ఏర్పాటు చేసే ఈ మండళ్లలో అన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి దరఖాస్తు చేసుకున్నవారికి కేటాయించాలని నిర్ణయించింది. వీటిలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు గడువును ఈనెల 31 వరకు పొడిగించాలని మంత్రి మండలి నిర్దేశించింది.
కొత్త విధానంలో..
ఆహార ఉత్పత్తులను స్టోరేజీకి తరలింపు తదితర లాజిస్టిక్స్‌ కోసం భూమి కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ఎగుమతులకు ఊతమివ్వాలని సూచించింది. ఆహారశుద్ధి మండళ్ల వద్ద కనీసం 500 మీటర్ల వరకు బఫర్‌జోన్‌గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని పేర్కొంది.
ప్రోత్సాహకాలు
* కొత్త మండళ్లు, వాటిలోని పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు
*విదేశాలకు ఎగుమతుల కోసం నాణ్యతతో కూడిన ప్రత్యేక ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు
* ఎస్సీ ఎస్టీ మైనారిటీవర్గాలకు సౌలభ్యంగా ఉండేలా ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణం
* సంస్థలు, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహకాలు
* గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రోత్సాహం
సబ్సిడీలు
* ప్రతి పరిశ్రమకు అయిదేళ్ల పాటు విద్యుత్తు వాడకంపై యూనిట్‌కు రూ. 2 చొప్పున సబ్సిడీ
* పెట్టుబడి రుణాలకు కట్టాల్సిన వడ్డీలో 75 శాతం (రూ. 2 కోట్లకు మించకుండా) ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* మార్కెట్‌ కమిటీకి కట్టాల్సిన ఫీజు ఏడేళ్ల వరకు ప్రభుత్వం భరిస్తుంది.  
* ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనంగా 15 శాతం మూలధనం (రూ. 20 లక్షలకు మించకుండా) మంజూరు. మూలధనం కోసం తీసుకునే రుణానికి చెల్లించాల్సిన వడ్డీలోని 10 శాతం చెల్లింపు. (85 శాతం లేదా రూ. 2 కోట్ల పరిమితి), అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధర మీద 33 శాతం సబ్సిడీ (రూ. 20 లక్షల పరిమితి)
* స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు అదనంగా 15 శాతం మూలధనం మంజూరు (రూ. కోటి పరిమితి), మూలధన రుణంపై  చెల్లించాల్సిన వడ్డీ 10 శాతం చెల్లింపు, భూమి విలువ మీద 33 శాతం వరకు సబ్సిడీ (రూ. 20 లక్షల పరిమితి)
 
ప్రధానాంశాలు

Related Keywords

,Minister Council ,அமைச்சர் சபை ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.