comparemela.com


Published : 04/07/2021 06:56 IST
పెళ్లయి ఏడేళ్లయినా.. ప్రియుడిని మరువలేక
అమ్రాబాద్‌, తలకొండపల్లి, న్యూస్‌టుడే : ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మద్దిమడుగులో శనివారం జరిగింది. ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన యువకుడు (30), యువతి(28) ప్రేమించుకున్నారు. విషయం తెలియడంతో తల్లిదండ్రులు యువతికి ఏడేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు కుమారులు. అయినా ప్రేమికుల మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఆమె, ఆ యువకుడు పది రోజుల కిందట వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. రెండు కుటుంబాల వారు వీరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ఇద్దరు శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగుకు చేరుకున్నారు. గ్రామంలోని ఆలయానికి అర కిలోమీటరు దూరంలో వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ఈ విషయంపై కుటుంబసభ్యులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. దీంతో రెండు కుటుంబాల వారు మద్దిమడుగుకు చేరుకొని గాలింపు చేపట్టారు. ఆలయ సమీపంలోని చెట్ల మధ్య వెదుకుతుండగా వివాహిత కుమారుడి ఏడుపు విని అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ విగత జీవులై పడి ఉన్నారు. గ్రామస్థులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అమ్రాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో తలకొండపల్లి మండలంలో విషాదం నెలకొంది. వారిరువురు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం కలకలం రేపింది.
Tags :

Related Keywords

,District Saturday ,Ranga Reddy ,Saturday District ,மாவட்டம் சனிக்கிழமை ,ரங்கா சிவப்பு ,சனிக்கிழமை மாவட்டம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.