భారీగా పెరిగిన పసిడి దిగుమతులు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో 6.91 బిలియన్ డాలర్ల (సుమారు రూ.51439 కోట్ల) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 79.14 మిలియన్ డాలర్ల (సుమారు రూ.600 కోట్ల) బంగారం మాత్రమే దిగుమతి కావడం గమనార్హం. అప్పుడు కొవిడ్ లాక్‌డౌన్ సంపూర్ణంగా అమలు కావడం వల్లే, ఈసారి పసిడి దిగుమతి భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు కూడా 9.91 బిలియన్ డాలర్ల నుంచి 21.38 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు కూడా 1.1 బిలియన్ డాలర్ల నుంచి 6.34 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఈసారి వెండి దిగుమతి మాత్రం 93.7 శాతం క్షీణించి, 27.56 మిలియన్ డాలర్లకు పరిమితమైంది.
Tags :