పామోలిన్‌లో కొనుగోళ్లు!
కమొడిటీస్ ఈ వారం
బంగారం, వెండి
పసిడి ఆగస్టు కాంట్రాక్టుకు ఈవారం రూ.46,794 స్థాయి వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.46,284 వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పైకి వెళితే రూ.47,305 సమీపంలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది.
* ఎంసీఎక్స్ బుల్‌డెక్స్ జులై కాంట్రాక్టు ఈవారం రూ.14,669 కంటే ఎగువన ట్రేడ్‌కాకుంటే రూ.14,383; రూ.14,246 వరకు దిద్దుబాటు అవుతుందని భావించవచ్చు.
* వెండి జులై కాంట్రాక్టు ఈవారం రూ.68,333 కంటే దిగువన ట్రేడయితే రూ.67,927; రూ.67,404 వరకు దిద్దుబాటు కావచ్చు.
ప్రాథమిక లోహాలు
* ఎంసీఎక్స్ మెటల్‌డెక్స్ జులై కాంట్రాక్టు ఈవారం రూ.15,331 కంటే ఎగువన ట్రేడ్ కాకుంటే మరింతగా పడిపోయే అవకాశం ఉంటుంది.
* రాగి జులై కాంట్రాక్టు ఈవారం రూ.705.85 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే సానుకూల ధోరణిలో కదలాడే అవకాశం ఉంటుంది. సీసం జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.174.85 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని, రూ.170.45-172.45 సమీపంలో షార్ట్ సెల్ చేయడం మంచిదే. జింక్ జులై కాంట్రాక్టు ఈవారం రూ.239.95 స్థాయిని అధిగమించడంలో విఫలమైతే, అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అల్యూమినియం జులై కాంట్రాక్టు ఈవారం రూ.199.65 స్థాయిని అధిగమించకుంటే, కొంత షార్ట్ సెల్లింగ్‌కు అవకాశం ఉంటుంది.
ఇంధన రంగం
* సహజవాయువు జులై కాంట్రాక్టును ఈవారం రూ.262; రూ.264.65 సమీపంలో షార్ట్ సెల్ చేయడం మంచిదే. అయితే రూ.265.65 వద్ద స్టాప్‌లాస్ తప్పక పెట్టుకోవాలి.
* ముడి చమురు జులై కాంట్రాక్టు ఈవారం రూ.4,376 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే.. ఈ స్థాయి వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మేలే.
* ముడి పామోలిన్ నూనె (సీపీఓ) జులై కాంట్రాక్టును ఈవారం రూ.945 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని కొనుగోలు చేయొచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు జులై కాంట్రాక్టుకు ఈవారం రూ.7,713కి స్టాప్‌లాస్ సవరించుకుని, షార్ట్ సెల్ పొజిషన్లు అట్టేపెట్టుకోవడం మంచిదే.
* సోయాబీన్ జులై కాంట్రాక్టు ఈవారం రూ.6,764 కంటే దిగువన ట్రేడ్ కాకుంటే రూ.7,130; రూ.7,334 లక్ష్యాలతో ధర పెరిగినప్పుడల్లా కాంట్రాక్టుకు లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మంచిదే.
- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Tags :