comparemela.com


వెంటాడి..వేటాడారు
ఫ్యాక్షన్‌ హత్యల్లో ఒకటే పంథా
పెసరవాయి ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా
అడుగడుగునా నిఘా వైఫల్యం
విలపిస్తున్న కుటుంబసభ్యులు.. ఆటోలో నాగేశ్వరరెడ్డి,
ప్రతాపరెడ్డి మృతదేహాల తరలింపు (అంతర చిత్రంలో..)
ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: ‘పగలు’ జడలు విప్పుతున్నాయి.. కత్తులు కరాళనృత్యం చేస్తున్నాయి. ప్రత్యర్థులు శత్రువుల గుండెల్లో మారణాయుధాలను దింపుతున్నారు. అతి కిరాతకంగా వెంటాడి.. వేటాడి చంపుతున్నారు. ఫ్యాక్షన్‌ నీడలు చాపకింద నీరులా.. నివురు గప్పిన నిప్పులా ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. ఇందుకు తార్కాణమే గడివేముల పరిధిలోని పెసరవాయిలో గురువారం ఉదయం జరిగిన జంట హత్యలు.. రాజకీయం.. హత్యలకు ఆజ్యం పోస్తుండగా పోలీసుల ఉదాసీనత, ఏకపక్ష ధోరణులు ఫ్యాక్షన్‌కు ప్రేరణ ఇస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండేళ్లలో రెండోది...
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రెండేళ్లలో ఫ్యాక్షన్‌ హత్యలు జరగడం ఇది రెండోసారి. తొలుత కొలిమిగుండ్ల పరిధిలో చింతలాయపల్లెకు చెందిన మంజుల సుబ్బారావును ప్రత్యర్థులు 2019 డిసెంబరు 17న బండతో మోది, కత్తులతో నరికి హత్య చేశారు. ఎన్నికల్లో తెదేపా తరఫున జడ్పీటీసీగా సుబ్బారావు పోటీకి దిగడంతో గెలుపునకు అడ్డు తగులుతాడని భావించిన అధికార పార్టీకి చెందిన గురివిరెడ్డి, నారాయణరెడ్డిలు ఫ్యాక్షన్‌ హత్య చేశారు. ఈ కేసులో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత గడివేముల మండలం పెసరవాయిలో వడ్డు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి సోదరులను పక్కా ప్రణాళికతో అదును చూసి ప్రత్యర్థులు హత్య చేశారు.
ఒకే పంథాలో..
కర్నూలులో ఫ్యాక్షన్‌ హత్యలకు ఒకే పంథాను అవలంబిస్తున్నారు. ప్రత్యర్థులను వాహనాలతో ఢీకొట్టి ఆ తర్వాత పాశవికంగా కత్తులతో దాడి చేసి చంపుతున్నారు. 2008 మేలో కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు వాహనాన్ని ఢీకొట్టి ఆపై దాడి చేసి చంపారు. ఆ తర్వాత 2017 మే 21న ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతున్న వైకాపా నేత చెరుకులపాడు నారాయణరెడ్డిని ఇదే పంథాలో హతమార్చారు. కారులో నుంచి లాగి బండతో తలపై మోది చంపారు. ప్రస్తుతం పెసరవాయి హత్యల్లోనూ ప్రత్యర్థులు ఇలానే చేశారు. శ్మశానం వద్దకు వెళుతున్న సమయంలో కారుతో కొందరిని ఢీకొట్టారు. ఆ తర్వాత ప్రతాపరెడ్డి (56), నాగేశ్వరరెడ్డి (58)పై దాడి చేసి నరికి చంపారు.
ప్రాణహాని ఉందన్నా పట్టించుకోరేం?
ఫ్యాక్షన్‌ హత్యలకు గురవుతున్న వారంతా.. ఏదో ఒక సమయంలో తమకు ప్రాణ హాని ఉందని పోలీసులను ఆశ్రయించిన వారే. ప్రస్తుత హతులు సైతం సర్పంచి ఎన్నికల్లో రక్షణ కోరినా అధికారులు తగిన చర్యలు చేపట్టలేదని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. చెరుకులపాడు నారాయణరెడ్డి సైతం ప్రత్యర్థుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఆయుధ లైసెన్సును పునరుద్ధరించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక పోలీసులకు కళ్లు, చెవుల్లా పనిచేయాల్సిన నిఘా వర్గాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారిస్తున్నది తక్కువే.
జిల్లాలో ఫ్యాక్షన్‌ గ్రామాలు: 74
‘ఎ’- కేటగిరీ ప్రాంతాలు : 02
సమస్యాత్మక గ్రామాలు: 150
జరిగిన హత్యలు
(2019లో-72)
కర్మక్రియలకు వచ్చి.. ప్రత్యర్థులకు చిక్కి.. 
గడివేముల, న్యూస్‌టుడే : మండలంలోని పెసరవాయి గ్రామంలో తెదేపా నాయకుడు.. మాజీ సర్పంచి వడ్డు నాగేశ్వరరెడ్డి (58), సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జిల్లా సహకార సంఘం మాజీ డైరెక్టరు వడ్డు ప్రతాపరెడ్డి (56) గురువారం ఉదయం ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురవడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల ఎంపీటీసీ ఎన్నికలు ఏకగ్రీవమవగా.. సర్పంచి ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. ఎన్నికల రోజున దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వారిని ప్రతాపరెడ్డి అడ్డుకోవడంతో ప్రత్యర్థులు దాడి చేసి కొట్టారు. అప్పటినుంచి గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామంలో మృతుల చిన్నాన్న కుమారుడు మోహన్‌రెడ్డి మంగళవారం చనిపోగా చిన్నకర్మలో పాల్గొనేందుకు వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డి, ఆయన భార్య లక్ష్మీదేవి, కుమార్తెలు ప్రవల్లిక, ప్రశాంతి, బంధువులైన వడ్డు వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, వడ్డు నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, వడ్డు వెంకటేశ్వరరెడ్డితోపాటు వారి వద్ద పనిచేస్తున్న స్వాములు, యేసేబు, చిన్న అల్లీబాషా శ్మశానవాటికకు పయనమయ్యారు. వీరు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాల్సి వచ్చింది. దీనిని గ్రహించిన ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి చనిపోగా వడ్డు వెంకటేశ్వరరెడ్డి, వడ్డు సుబ్బారెడ్డి, వడ్డు వెంకటేశ్వరరెడ్డి గాయపడ్డారు. ఏపీ 21 బీయూ 0239తోపాటు ఏపీ 09 యూవీ 9339 కారులో వచ్చిన నిందితులు వేటకొడవళ్లు, గొడ్డలి, కత్తితో నరికి చంపారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీఐతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
మృతదేహాలకు రక్షణ కల్పించేందుకు వచ్చారా..
మృతదేహాల వద్ద వారి కుమార్తెలు విలపించడం అందరినీ కలచివేసింది. మా తండ్రికి రక్షణ కల్పించకపోవడంతోనే హత్యకు గురయ్యారని.. శవపరీక్ష ఎందుకు చేయించాలని పోలీసులను నిలదీశారు. బతికి ఉన్నప్పుడు రక్షణ ఇవ్వలేని మీరు చనిపోయిన తర్వాత మృతదేహాలకు రక్షణ కల్పించేందుకు వచ్చారా అంటూ నిలదీశారు.
గ్రామాధిపత్యం.. తీసింది ప్రాణం
గడివేముల, న్యూస్‌టుడే, నంద్యాల నేర విభాగం : పెసరవాయిలో గ్రామాధిపత్యమే ఫ్యాక్షన్‌కు కారణమైంది. గ్రామంలో 1996 వరకు హేమసుందరరెడ్డి వర్గానిదే ఆధిపత్యం సాగేది. దీంతోపాటు శ్మశాన స్థలంపై వివాదం చోటుచేసుకోవడం, సర్పంచి ఎన్నికలు, ఇతర వివాదాలు.. హేమసుందరరెడ్డిపై రెండుసార్లు హత్యాయత్నాలకు దారితీశాయి. అనంతరం క్రమంగా గ్రామాధిపత్యం వడ్డు వర్గం చేతిలోకి వచ్చింది. 2013కు ముందు జరిగిన ఎన్నికల్లో వడ్డు నాగేశ్వరరెడ్డి సర్పంచిగా ఎన్నికయ్యారు. వడ్డు ప్రతాపరెడ్డి సహకార సంఘం అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. 2013లో జరిగిన సర్పంచి ఎన్నికల్లో ఇరువర్గాలు మాట్లాడుకుని నాగేశ్వరరెడ్డితోపాటు రాజారెడ్డికి చెరి రెండున్నరేళ్ల కాలం సర్పంచి పదవి అనుభవించేలా ఒప్పందం చేసుకున్నారు. గడువు తీరినా నాగేశ్వరరెడ్డి తన పదవికి రాజీనామా చేయకపోవడం.. పూర్తికాలం పదవిలో ఉండడం హత్యకు దారి తీసిందని పోలీసులు భావిస్తున్నారు. 2021లో జరిగిన సర్పంచి ఎన్నికలు మరోసారి వివాదానికి కారణమయ్యాయి. దొంగ ఓట్లు వేస్తున్నారనే కారణంతో ఓటు వేయడానికి వచ్చిన ఒకరిని హతుడు ప్రతాపరెడ్డి అడ్డుకున్నారు. ఘర్షణ జరగడంతో పోలీసులు ప్రతాపరెడ్డిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అప్పటినుంచి వివాదం రాజుకుంటూనే ఉంది.
శ్మశాన స్థలం విషయంలో..
గ్రామంలోని శ్మశాన స్థలం ఆది నుంచి వివాదాస్పదంగా మారింది. గతంలో శ్మశాన స్థలం విషయమై హేమసుందర్‌రెడ్డి వర్గీయులకు, బూసిరెడ్డి వర్గీయులకు మధ్య వివాదం ఏర్పడింది. అనంతరం ప్రభుత్వ నిధుల ద్వారా శ్మశానాన్ని వడ్డు నాగేశ్వరరెడ్డి అభివృద్ధి చేశారు. ఆ తర్వాత కర్నూలు విజయ ఆస్పత్రి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరూ హత్యకు గురయ్యారు.
​​​​​​​
ఘటనా స్థలంలో కారు శకలాలు
నిందితులు ఉపయోగించిన కారు శకలాలు ఘటనా స్థలంలో లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీని ద్వారా ఎవరు చేశారనే విషయమై పోలీసులకు స్పష్టత వచ్చినట్లు సమాచారం. మరోవైపు పోలీసులు జాగిలాలతో తనిఖీ చేయగా ఘటనా స్థలం నుంచి గ్రామంలోకి వెళ్లింది. క్లూస్‌టీం అధికారులు అనుమానిత వస్తువులను సేకరించారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags :

Related Keywords

Kurnool ,Andhra Pradesh ,India ,Nandyal , ,Her Post ,Place Sun ,Place Issue ,వ ట డ ర ,Enadu ,Districts ,Latestnews ,21123135 ,District News In Telugu ,P District News In Telugu ,S District News In Telugu ,Yderabad District News In Telugu ,Rishna District News In Telugu ,Untur District News In Telugu ,Rakasam District News In Telugu ,Ast Godavari District News In Telugu ,Est Godavari District News In Telugu ,Ishakapatanam District News In Telugu ,Maravati District News In Telugu ,Izanagaram District News In Telugu ,Rikakulam District News In Telugu ,Arangal District News In Telugu ,Arimnagar District News In Telugu ,Izamabad District News In Telugu ,Dilabad District News In Telugu ,Hammam District News In Telugu ,Algonda District News In Telugu ,Ijayawada News In Telugu ,Yderabad News In Telugu ,Urnool District News In Telugu ,Hitoor District News In Telugu ,Adapa District News In Telugu ,Nantapur District News In Telugu ,Ellore District News In Telugu ,Op Stories ,Elugu Top Stories ,கர்னூல் ,ஆந்திரா பிரதேஷ் ,இந்தியா ,நந்தியல் ,அவள் போஸ்ட் ,மாவட்டங்கள் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.