ఆస్తికంగా ఆలోచిస్తే ధైర్యం తొలి జాడ పూజాదికాలలో కనిపిస్తుంది. ప్రతి మనిషీ దేవుడిని వేడుకునే కోరికల జాబితాలో ధైర్యమూ ఒకటి. ‘అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం....’ ఈ సంకల్పంలో క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాలను ఒక వరుసలో చూస్తాం. అంటే మిగతా ఎన్ని ఉన్నా ధైర్యం తప్పకుండా మనిషికి ఉండి తీరాల్సిందే! ధైర్యానికే జయం!