comparemela.com


జిల్లాస్థాయి నేతలే తొలి టార్గెట్‌
                         - శశికళ వ్యూహం!
చెన్నై: అన్నాడీఎంకే జిల్లా స్థాయి నేతలను తన వైపునకు తిప్పుకునే దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ వ్యూహరచన రూపొందిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు వీలుగా ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక రాజకీయాలవైపు కన్నెత్తి చూడనని ప్రకటించిన శశికళ ప్రస్తుతం అన్నాడీఎంకేపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత కొద్ది మాసాలుగా ఆమె అన్నాడీఎంకే కార్యకర్తలతో జిల్లా శాఖ నాయకులతో ఫోన్‌లో అదే పనిగా సంభాషణలు జరుపుతూ పార్టీకి పూర్వ వైభవం కల్పించే క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానంటూ ప్రకటించారు. అదే సమయంలో శశికళతో ఫోన్‌లో సంభాషించిన నేతలను అన్నాడీఎంకే నేతలు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శశికళ కొత్త వ్యూహంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన జరిపేందుకు తగుసన్నాహాలు చేపడుతున్నారు. ఈ నెలాఖరులోపున లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగి రాజకీయ సభలు, సమావేశాలు జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే అవకాశం వుండటంతో అందుగు తగినట్టు ఆగస్టు నుంచి శశికళ తన పర్యటనను ప్రారంభిస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా శశికళ టి.నగర్‌లో నివసిస్తున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించ నున్నారని చెబుతున్నారు. తనతో ఫోన్‌లో సంభాషించిన పార్టీ నేతల ద్వారా అన్నాడీఎంకే జిల్లా శాఖ నేతలను ఆమె స్వయంగా కలుసుకోనున్నారు. అన్నాడీఎంకేకు పూర్వవైభవం కల్పించడానికి తనకు గట్టి మద్దతు ఇవ్వమంటూ ఆమె జిల్లా శాఖ నాయకులతో రహస్యంగా సమావేశమై చర్చలు జరుపనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తననే అంగీకరించాలని, ఆ దిశగా అన్నాడీఎంకే అధిష్టానవర్గంపై ఒత్తిడి చేయాలని జిల్లా శాఖ నాయకులకు ఆమె ఆదేశించనున్నారు. అన్నాడీఎంకేలో ఆగస్టులో సంక్షోభం తప్పదని, ఆ సమయంలో శశికళ తన రాజకీయ చతురతతో పార్టీ పగ్గాలను చేపట్టే దిశగా చర్యలు చేపట్టడం ఖాయమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు, మాజీ నాయకులతోనూ శశికళ చర్చలు జరుపుతారని తెలిపారు. కోటిమందికిపైగా ఉన్న పార్టీ శ్రేణులను తన వైపునకు తిప్పుకునేందుకు ఆమె పటిష్టమైన వ్యూహరచనతో పర్యటన ప్రారంభిస్తారని ప్రకటించారు.

Related Keywords

Chennai ,Tamil Nadu ,India ,Jayalalithaa Shashikala ,Her District The Department ,District The Department ,Shashikala New ,Shashikala Her ,Start Her ,Her District ,Main Secretary ,சென்னை ,தமிழ் நாடு ,இந்தியா ,தொடங்கு அவள் ,அவள் மாவட்டம் ,பிரதான செயலாளர் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.