న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,120 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కోవిడ్ కేసులు 3.21 కోట్లకు చేరాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3.85 లక్షల కేసులున్నాయి. ఇక కరోనా నుంచి 3.13 కోట్ల మంది కోలుకున్నారు. ఇక గురువారం ఒక్కరోజే కరోనాతో 585 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4.3 లక్షలకు చేరింది. ఇక కేరళలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 21,445 కేసులు నమోదయ్యాయి.