ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరోనా వారియర్స్‌కు తక్షణమే ఆరు నెలల బకాయిలు చెల్లించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. కరోనా వైద్య సేవలు అందించేందుకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నియమించిన 26,325 మందికి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్న సలహాదారులు ఒక్కరికైనా ప్రభుత్వం బకాయి పెట్టిందా? అని నిలదీశారు.