సాక్షి, అమరావతి: విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయి. ప్రధానంగా అమెరికాలో చదవాలనుకునే వారికి రాష్ట్రం నుంచి రాచబాట సిద్ధమైంది. స్టెమ్ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు) విద్య, మహిళా సాధికారత, అమెరికన్ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి