సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం రాజ్యసభలో చెలరేగిన రగడపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు అనుకున్న గడువు కంటే ముందే ముగియడానికి మీరంటే మీరే కారణమని అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి. ఇక బుధవారం రాజ్యసభలో మార్షల్స్‌పై జరిగిన దాడికి సంబంధించి విపక్ష నేతలు.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. బయట సిబ్బందిని తీసుకొచ్చి