హైదరాబాద్ : చిన్నారుల కోవాగ్జిన్ టీకాపై రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్‌ను భారత బయోటెక్ సంస్థ పూర్తి చేసింది. ఈ క్లినికల్ పరీక్షల డేటాను వచ్చే వారంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ)కు అందించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కఅష్ణ ఎల్లా తెలిపారు. వయోజనులకు అందించిన టీకా మాదిరిగానే పిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్ ఉంటుందని అన్నారు. పిల్లల టీకాపై క్లినికల్ పరీక్షల డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. దాదాపు 1,000 మంది వాలంటీర్లపై పిల్లల కోవాగ్జిన్‌ను ప్రయోగించామని పేర్కొన్నారు.