comparemela.com


Jul 23, 2021, 10:13 IST
kaushal Manda: కౌశల్‌ మండా.. ఈ పేరు తెలియని బిగ్‌బాస్‌ ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా మామూలుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు రెండో సీజన్‌ విన్నర్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. బిగ్‌బాస్‌ షో తర్వాత అతడికి బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చాయంటూ నెట్టింట రూమర్లు రౌండేశాయి కానీ అవేవీ నిజం కాలేదు. అయితే కొన్ని చిత్రాల్లో మాత్రం సపోర్టివ్‌ రోల్స్‌ అవకాశాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం అతడు హీరో ఆది 'బ్లాక్‌' సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు. కానీ ఇంతవరకు హీరో రోల్‌ మాత్రం చేయలేదు. బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ వచ్చి మూడేళ్లు దాటిపోయినా ఇంతవరకు కథానాయకుడిగా సినిమా చేయకపోవడంతో ఫ్యాన్స్‌ కొంత నిరాశలో ఉన్నారు. అయితే తన అభిమానుల దిగులును పటాపంచలు చేస్తూ ఓ శుభవార్త చెప్పాడు కౌశల్‌. రైట్‌ సినిమాలో హీరోగా చేస్తున్నానంటూ పోస్టర్‌ను షేర్‌ చేశాడు. 
"గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ.. పీపుల్‌ స్టార్‌గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్‌స్క్రీన్‌ మీద హీరోగా చూడాలనుంది, ఆ అవకాశం మాకెప్పుడు వస్తుంది? అంటూ ప్రతిరోజూ అడిగే వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు మీ అందరిరోజుగా చేస్తూ నేను హీరోగా నటిస్తున్న రైట్‌ మూవీ ముహూర్తం షాట్‌ మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. ఎప్పటిలాగే మీ ప్రేమ, అభిమానం నా మీద, మా మూవీ యూనిట్‌ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు" అంటూ పోస్ట్‌ పెట్టాడు. ఇన్నాళ్లకు నటుడు కౌశల్‌ హీరో అవుతుండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం పీపుల్‌ స్టారా? ఇదెప్పుడు పెట్టారు? ఈ మధ్య ఎవరికి వాళ్లే స్టార్‌ ట్యాగ్‌ తగిలించుకోవడం ప్యాషన్‌ అయిపోయింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Related Keywords

,Rumor But ,Hero Sun ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.