comparemela.com


పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో హిందువులను బలవంతంగా మతమార్పిడి చేశారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్‌) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. '' సారీ, మీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నాం. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా వేసిన ఈ పిటిషన్‌పై విచారణ చేయాలని అనుకోవడం లేదు'' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌దారుల తరపున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాద నలు వినిపించారు. గతేడాది అక్టోబర్‌లో బల్లాబ్‌ఘర్‌ లోని కాలేజ్‌ బయట హత్యకు గురైన హిందూ యువతి నిఖిత తోమర్‌ కుటుంబంతో ఆ ప్రాంతంలోని ప్రజలను తమ పిటిషన్‌దారులు కలిశారని తెలిపారు. హత్య కేసులో నిందితుడిగా ఉన్న తౌసిఫ్‌ అనే వ్యక్తి నిఖిత తోమర్‌ను బలవంతంగా వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలు ఉన్నాయి. తోమర్‌ హత్య కేసులో హర్యానాలోని ఫరీదాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.
తాజా వార్తలు

Related Keywords

Haryana ,India ,New Delhi ,Delhi , ,Supreme Court ,Haryana Court ,Supreme Court New Delhi ,Denied Supreme Court New Delhi ,Haryana District Hindus ,Supreme Court Monday ,ஹரியானா ,இந்தியா ,புதியது டெல்ஹி ,டெல்ஹி ,உச்ச நீதிமன்றம் ,ஹரியானா நீதிமன்றம் ,உச்ச நீதிமன்றம் புதியது டெல்ஹி ,உச்ச நீதிமன்றம் திங்கட்கிழமை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.