విభజన చట్టం ప్రకారం రావలసిన స్థిర, చరాస్తులను వెంటనే తమకు అప్పగించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలుగు అకాడమీకి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో తమకు రావలసిన నిధులు, ఆస్తులకు సంబంధించిన వాటాలను వెంటనే అప్పగించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.