అమరావతి : మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనపడుతోంది. ట్రస్ట్ వారసత్వంపై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును కొనసాగించాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.. చైర్మన్ నియామకంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు సంచయిత, ఊర్మిళ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది.