comparemela.com


రాసలీలల బాబా!
11 మంది మహిళా భక్తులతో వివాహేతర సంబంధం
 à°¨à°²à±à°²à°—ొండ జిల్లా అజ్మాపురంలో ఆశ్రమం పేరుతో దందా
తనకిచ్చిన దానికి నాలుగురెట్ల సంపద వస్తుందని బురిడీ
నల్లగొండ క్రైం, ఆగస్టు 3: ఓ సినిమాలో హీరో, తన ఆఫీసులో పనిచేసే అమ్మాయికి ప్యారిస్‌ నుంచి పెర్‌ఫ్యూమ్‌ తెచ్చానంటూ ఇస్తాడు. కథానాయిక గద్దిస్తే వస్తూ వస్తూ కోటీలో కొన్నానంటూ ఒప్పుకొంటాడు. ఈ దొంగ బాబా ఇంతే. మూలికలను మోజాంజాహీ మార్కెట్లో, తాయెత్తులను నాంపల్లిలో కొని.. మహిమ గల వస్తువులని నమ్మించి భక్తులకు అంటగట్టి కోట్లలో ఆస్తులు కూడగట్టాడు. అంతేనా.. వివిధ సమస్యలతో తన వద్దకొచ్చే మహిళలను మాయమాటలతో లోబర్చుకొని వారితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. బాబానంటూ చెప్పుకొనే అతడి మొబైల్‌లో అన్నీ మహిళల నగ్న వీడియోలు, వాట్సా్‌పలో బూతు చాటింగ్‌లే. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ దొంగ బాబా గుట్టును నల్లగొండ పోలీసులు రట్టు చేశారు. దొంగ బాబా అంబపూడి సాయి విశ్వచైతన్య అలియాస్‌ విశ్వనాథ మురళీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
సాయి విశ్వచైతన్యది ఏపీ కృష్ణాజిల్లా నందిగామ. నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో నాలుగేళ్ల క్రితం పదెకరాలు కొన్నాడు. గత ఏడాది జూన్‌లో అక్కడ ‘శ్రీసాయి సర్వస్వం మాన్సి మహాసంస్థానం ట్రస్ట్‌’ పేరుతో ఆశ్రమం నెలకొల్పాడు. అతడికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. పీజీ చదివాడు. 2002లో హైదరాబాద్‌ న్యూ నల్లకుంటలో ఓ కంప్యూటర్‌ సెంటర్‌ పెట్టి జనాల నుంచి రూ.కోటి వసూలు చేసి మోసగించాడు. మరో ఘటనలో నాంపల్లి  పరిధిలో ఓ కేసు నమోదు కాగా జైలు పాలై బెయిల్‌ మీద బయటకొచ్చి సాయి భక్తుడిగా అవతారమెత్తాడు. పౌరోహిత్యం చేస్తూనే వివిధ టీవీ చానళ్లలో ప్రవచనాలు చెప్పాడు. 2017లో సొంతంగా శ్రీసాయి సర్వస్వం పేరుతో సొంత యూట్యూబ్‌ చానల్‌ను పెట్టాడు. ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ పేరుతో భక్తుల నుంచి రూ.500- రూ.1100 దాకా తీసుకొని  మూలికలు, తాయెత్తులు ఇచ్చేవాడు. నిరుటి నుంచి అడిశర్లపల్లిలోని తన ఆశ్రమానికి కుటుంబ, ఆరోగ్య సమస్యలతో వచ్చే భక్తుల నుంచి పూజలు, హోమాల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నాడు. తనకు సాయిబాబానే కలలోకి కనిపించాడని, భక్తుల నుంచి డొనేషన్లను నగదు, బంగారం రూపంలో తీసుకోవాలని సూచించాడని.. తనకు ఎంత ఇస్తే, అంతకు నాలుగు రెట్ల లాభాలు వస్తాయని జనాలను నమ్మించేవాడు. 
రూ.1500 చొప్పున..
దివ్య రక్షణ కవచ యంత్రం, మాయా ఛేదిని, నవధాతు దీపనూనె తదితరాలకు ఒక్కోదానికి భక్తుల నుంచి రూ.1500 దాకా వసూలు చేసేవాడు. ఇవన్నీ రూ.150 చొప్పున నాంపల్లి, మోజంజాహీ మార్కెట్లలో కొనేవాడు! విశ్వచైతన్య ప్రవచనాలకు ఆకర్షితులైన మహిళలు ఆయనకు భక్తులుగా మారారు. వారిలో ఓ 11 మందితో విశ్వ చైతన్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. దీంతో అతడి భార్య నాగవల్లి విడాకులు తీసుకుంది. తర్వాత అతడు సుజీత (20) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. 
అరకిలో బంగారం, కోట్లలో ఎఫ్‌డీలు
దొంగబాబా విశ్వ చైతన్యతోపాటు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం నారాయణపురానికి చెందిన గాజుల గౌతమ్‌, ఖమ్మానికి చెందిన  వంగరు సృజన్‌కుమార్‌, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన ఓర్సు విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.26లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు, రూ.1.5 కోట్ల ఎఫ్‌డీలు, 17 ఎకరాల భూమి తాలూకు పత్రాలు, ఏడు ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వచైతన్య భార్య సుజీత పేరిట రూ.1.3 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్లు తేలింది. 

Related Keywords

,Her Office ,Nalgonda District Asylum ,Andhra Vijayawada ,Nalgonda District ,Anantapur District ,அவள் அலுவலகம் ,நல்கொண்டா மாவட்டம் ,ஆனந்தபுர் மாவட்டம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.