comparemela.com


భవనం నుంచిపడి పెయింటర్‌ దుర్మరణం
తిరుపతి: భవనం నుంచి కిందపడటంతో ఓ పెయింటర్‌ దుర్మరణం చెందాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన అంజి (35) తిరుపతిలో పెయింట్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాత రేణిగుంట రోడ్డులో నిర్మాణం పూర్తయిన ఓ భవనానికి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పెయింటింగ్‌ పనులు మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ భవనం పైనుంచి కింద పడ్డాడు. తీవ్రగాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. 

Related Keywords

Nagendra Babu ,Sv College ,Anantapur District ,நாகேந்திரா பாபு ,ஆனந்தபுர் மாவட்டம் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.