comparemela.com


హుజూరాబాద్‌పై టీపీసీసీ నజర్‌!
ఇన్‌చార్జులు, సమన్వయకర్తల నియామకం
పీసీసీ ఇన్‌చార్జిగా దామోదర రాజనర్సింహ 
హైదరాబాద్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాకున్నా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వాతావరణం వేడెక్కడంతో టీపీసీసీ కూడా దీనిపై దృష్టి సారించింది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి పీసీసీ, మండల ఇన్‌చార్జులను, సమన్వయ కర్తలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం నియమించారు. టీపీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పీసీసీ ఇన్‌చార్జిగాను, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను సమన్వయకర్తలుగానూ నియమించారు. అలాగే ఇల్లంతకుంట మండలానికి మాజీ మంత్రి కొండా సురేఖ, కరీంనగర్‌ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డిలను, జమ్మికుంట టౌన్‌కు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్యలను, హుజూరాబాద్‌ మండలానికి మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్‌లను, జమ్మికుంట మండలానికి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, పార్టీ నేత రాజ్‌ఠాకూర్‌లను, వీణవంక మండలానికి పార్టీ నేత ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల టౌన్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివా్‌సలను, హుజూరాబాద్‌ టౌన్‌కు పార్టీ నేతలు బొమ్మ శ్రీరాంచక్రవర్తి, జువ్వాడి నర్సింగరావులను, కమలాపూర్‌ మండలానికి వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పార్టీ నేత దొమ్మాటి సాంబయ్యలను ఇన్‌చార్జులుగా నియమించారు. 
భూముల అమ్మకం ఆపాలి: కోదండరెడ్డి 
రాష్ట్రంలో ప్రభుత్వ భూముల అమ్మకం ప్రక్రియను ఆపాలని, దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజా అవసరాల కోసం పేదల నుంచి రూ. లక్షల ధరకు తీసుకున్న భూములను ధనికులకు రూ. కోట్లకు అమ్ముకుంటున్నారని, ఇది అన్యాయమని మండిపడ్డారు.కాగా, రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డిని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావ్‌ కోరారు.  

Related Keywords

Damodar Raja Narasimha ,Hill Surekha , ,Raja Narasimha ,President Wednesday ,Minister Hill Surekha ,President Komatireddy ,Main Secretary Anus ,President Music ,President Nai ,ராஜா நரசிம்ம ,ப்ரெஸிடெஂட் புதன்கிழமை ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.