comparemela.com


సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట రైతులకు రూ.15 లక్షలు టోకరా..
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి రైతులకు మిర్చి విత్తనాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.15 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు నిందితుడు. వివరాల్లోకి వెళ్తే.. సత్తెనపల్లి రైతులకు ఆర్మూర్ మిర్చి విత్తనాలు ఇప్పిస్తానని నాగిరెడ్డి చెప్పాడు. కాగా.. మిర్చి విత్తనాలు కావాలంటే..అడ్వాన్స్ డబ్బులు కావాలని చెప్పడంతో రైతులు నమ్మకంతో డబ్బులు నాగిరెడ్డికి ఇచ్చారు. అయితే.. రైతుల దగ్గర సుమారుగా రూ. 15 లక్షల వరకు వసూలు చేసిన నాగిరెడ్డి జాడ లేకుండా పరారయ్యాడు. సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట ప్రాంత రైతులు నాగిరెడ్డి దగ్గర మోసపోయామని తెలుసుకుని పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగిరెడ్డి కోసం గాలిస్తున్నారు.

Related Keywords

,District Sattenapalli ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.