comparemela.com


తియనన్మెన్.. నిందలు, నిజాలు
నాడూ నేడూ కూడా చైనా అంతరంగాన్ని అర్థం చేసుకునేందుకు ‘రెడ్ జీన్’ ఒక కీలక సంకేతం. అభివృద్ధి, సంపదలు, సౌకర్యాలు, టెక్నాలజీలు అన్నీ కలిసి ‘ఎర్రజన్యువు’ని పలుచన చేసేస్తాయేమో అన్నది చైనా నాయకత్వపు ఆందోళన. మావో అనంతరం డెంగ్ ప్రారంభించిన ఉదారవాద ఆర్థిక సంస్కరణలతో చైనాకు అపార సిరిసంపదలు సమకూరాయి. అయితే ‘చైనా తరహా సోషలిజం’ పేరిట అనుసరించిన వ్యూహం-, ఎత్తుగడల పట్ల అవగాహనలో గందరగోళం నెలకొని ఉంది– ముఖ్యంగా యువతరంలో. కొన్ని భ్రమలూ, అలజడులూ తలెత్తాయి. ఆ ప్రమాదాన్ని పసిగట్టే ‘బూర్జువా లిబరలైజేషన్’కి వ్యతిరేకంగా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆ నాడే 1980 దశకం తుదినాళ్ళలోనే ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడి మాత్రమే ఉండాలని పార్టీ ఆదేశించింది. సంస్కరణల క్రమంలో పెచ్చరిల్లిన ‘బూర్జువా లిబరలైజేషన్’ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి ఉండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మార్క్సిస్టు -లెనినిస్టు-మావో సిద్ధాంత నేతృత్వం, (అన్నిటికన్నా కీలకమైన) పార్టీ నాయకత్వం. ఈ వెలుగులో, చైనా కమ్యూనిస్టు పార్టీ నూరేళ్ళ ఉత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత సందర్భంలో ‘తియనన్మెన్ స్క్వేర్ సంఘటనల’ను పునర్దర్శించవలసి ఉంది. 
చైనా విద్యార్థుల తిరుగుబాటే ‘తియనన్మెన్ స్క్వేర్ సంఘటనలు’. 1989 జూన్ 4à°¨ సంభవించిన ఆ ఘటనల గురించి ఇటీవల ప్రచురితమైన ఒక విశిష్ట గ్రంథం ‘Tiananmen Square-The Making of a Protest -- A Diplomat Looks Back’. నవ చైనా చరిత్రలో ఒక ముఖ్య ఘటన చరిత్రను ఆ పుస్తకం ‘తిరగరాసింది’. ఆ ఘటనల సమయంలో చైనాలో ఇండియా రాయబారిగా ఉన్న విజయ్ గోఖలే రాసిన పుస్తకమది. తియనన్మెన్ ఘటనలపై పాశ్చాత్య కథనాలను గోఖలే సవాలు చేశారు. ‘ఇరుపక్షాల మీడియా కూడా భావజాలపర పక్షపాతాలతో కూడి ఉంది. ఆ 50రోజుల ఘటనలను నాస్వంత అనుభవంతో చూశాను. నిజంగా ఏం జరుగుతున్నది అని పరిశీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్తలను వండి వార్చారు; చైనా విద్యార్థుల్లో కొందరు సైతం అందులో భాగమయ్యారు. వారు చెప్పినవి పూర్తి వాస్తవాలు కావు; వారి ఆధారాలు (సోర్సెస్) ప్రశ్నించదగినవి అని నాకు స్వయంగా ఎరుక పరిచిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అవన్నీ నా కళ్ళు తెరిపించాయి. ఈ మొత్తాన్ని పాశ్చాత్య మీడియా తమదైన ‘శైలి’లో వక్రీకరించాయి. అందుకే వీటిని బైటపెట్టాల్సిన అవసరముంది అని భావించాను’ అని గోఖలే అన్నారు. కరోనా గురించి చైనా వ్యతిరేక పాశ్చాత్య దుమారం సందర్భంలో చాలా ప్రాముఖ్యతగల మాటలివి. చైనా విప్లవ నిర్మాతల మహా పోరాటాలు, అనుపమేయ త్యాగాల గురించి లోతుగా తెలియని యువతరం వారి ఆందోళనే తియనన్మెన్ సంఘటనలు. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని విద్యార్థులు వారు. ఆర్థిక సంస్కరణలతో చైనా ఒక ఉదారవాద ప్రజాస్వామ్య దేశంగా మారిపోతుందని పాశ్చాత్యదేశాలు భావించాయి. అది దారితప్పిన (మిస్ గైడెడ్) ఊహ మాత్రమే అని గోఖలే అన్నారు. ‘1989 నుంచీ భారత విదేశాంగశాఖ, రాజకీయ నాయకత్వం కూడా ఆ విషయాన్ని విశ్వసించటం లేదు. ఆ మాట పాశ్చాత్యులకు చెప్పాం కూడా. అయినా చైనా మార్కెట్, అక్కడ వస్తున్న లాభాలతో వారు మిన్నకుండిపోయారు’ అని ఆయన అన్నారు. 
తియనన్మెన్ ఘటనల గురించి ఎన్నో కథనాలున్నాయి. ఆనాటి కొందరు విద్యార్థి నేతలు చాటుగా భోజనాలు చేస్తూ నిరాహారదీక్షలు చేసినవారని, పాశ్చాత్య మీడియా ఆకర్షణ గలవారని గోఖలే వెల్లడించారు. నిజానికి నిరాహారదీక్షలు చేయరాదని విద్యార్థుల ఫెడరేషన్ తీర్మానించింది కూడా. అయినా ఒక నాయకుడు మీడియా ముందు ఈ ‘డ్రామా’ను మొదలుపెట్టాడు. విద్యార్థులలో బాగా చీలిక ఉండేది; ఎవరికి వారు తమని తాము నాయకులుగా చెప్పుకునేవారు, రహస్య ఎజెండాలతో వారు ఎలా పనిచేశారో గోఖలే బయటపెట్టారు. సంస్కరణల గురించి పార్టీ నాయకత్వంలో విభేదాలు, చర్చలు కొనసాగుతున్న కాలమది. 1989 ఏప్రిల్ 15న పొలిట్ బ్యూరో సమావేశంలో హుయావో బాంగ్ గుండెపోటుతో మరణించారు. డెంగ్ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేత. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో 1987 జనవరి 16న పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి హుయావో బాంగ్ రాజీనామా చేశారు. అయితే పొలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగారు. ఆయన మరణించిన తరుణంలో పార్టీలోని కొన్ని శక్తులు విద్యార్థులను ఎగదోసాయి. పాశ్చాత్య మీడియా ఆ అలజడికి ఆజ్యం పోసింది. అలా ఏప్రిల్ 18-22న హుయావో బాంగ్‌కు సంతాపం పేరిట వేలాదిమంది తరలివచ్చారు. తిరుగుబాటు రగిలింది. అది 50రోజులు కొనసాగింది.
ప్రధానమంత్రి మైదానంలోకి వచ్చి తమతో చర్చలు జరపాలని కొందరు విద్యార్థులు మొండిగా డిమాండ్ చేశారు. ప్రధాని లీపెంగ్ జనం మధ్యకి వచ్చి, నేలపై కూర్చొని మే18న జరిపిన సుదీర్ఘ చర్చలను, ఫోటోలను ఆనాటి చైనా టీవీ, పత్రికలు ప్రచురించాయి. 300మందికి పైగా కీలక పార్టీ, ప్రభుత్వ నాయకులు ఉండే కేంద్రస్థానం తియనన్మెన్ స్క్వేర్. వారి నివాసాలు, ఆఫీసులు, ప్రభుత్వ సెక్రటేరియట్ కూడా అందులోనే. అలాంటి ప్రదేశాన్ని లక్ష మంది విద్యార్థులు ముట్టడించారు. నెల రోజుల తర్వాత గాని (మే20న) మార్షల్ లా ప్రకటించలేదు. ఆ తర్వాతే సైన్య ప్రవేశం. అయితే నగరం వెలుపలే దాన్ని మొహరించారు. మే15న రష్యానేత గోర్బచేవ్ పర్యటన సందర్భంగా స్క్వేర్‌లో కార్యక్రమాల కోసం ‘గ్రౌండుని క్లియర్’ చేయాలా అని చర్చించారు. కానీ చేయలేదు. జూన్ 3 రాత్రి దాకా ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు. మానవాళి చరిత్రలో ఇలాంటి తిరుగుబాటుని అన్ని రోజులు అనుమతించిన రాజ్యం మరొకటి లేదు. చర్చలద్వారా 90-95 శాతం మందిని నచ్చచెప్పి ఇళ్ళకు పంపేశారు. వారు పోగా ఇంకా 5 నుంచి 10వేల మంది దాకా ఉంటారు. ‘మొత్తం’ ఎంతమంది చనిపోయారు? చైనా లెక్క 300 (సైనికులతో సహా). జూన్ 3 రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలో ఉన్న పుకార్ల ప్రకారం పదివేల మంది. అమెరికా గూఢచార వర్గాలు 500 మంది అని పేర్కొన్నాయి. 1000 మంది దాకా చనిపోయారని అమ్నెస్టీ అభిప్రాయపడింది. 400 నుంచి 800 మంది చనిపోయారని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. తియనన్మెన్ స్క్వేర్‌లో అసలు విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. నిజమే ‘అక్కడ అలాంటి ఆధారాలు ఏవీ లేవ’ని వాషింగ్టన్ పోస్టు విలేఖరులు; ‘అక్కడ ఎలాటి ఊచకోతనీ చూడలేద’ని సంఘీభావంగా జనం మధ్యే ఉన్న తైవాన్ విలేఖరి పేర్కొన్నారు. ‘అక్కడ’ రక్తపాతం జరుగలేదని 2011లో అమెరికా రాయబార కార్యాలయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి. పాశ్చాత్య కపటాన్ని (నేటి భాషలో ‘పోస్ట్ ట్రూత్’) చైనా నిర్దిష్టంగా బట్టబయలు చేసింది. గోఖలే ‘తిరగరాసిన చరిత్ర’ని తరచిచూడాల్సిన అవసరం ఉంది.
యం. జయలక్ష్మి

Related Keywords

China ,Taiwan ,United States ,India ,Washington ,Vijay Gokhale ,Polit Bureau ,United States Embassy ,Revolt Square ,Outstanding Book ,China India ,India State ,April Polit Bureau ,Main Secretary Post ,April Obituary ,Prime Minister ,சீனா ,டைவாந் ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,இந்தியா ,வாஷிங்டன் ,விஜய் கோகலே ,ஒன்றுபட்டது மாநிலங்களில் தூதரகம் ,ஔட்‌ஸ்ட்யாஂடிஂக் நூல் ,சீனா இந்தியா ,இந்தியா நிலை ,ப்ரைம் அமைச்சர் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.