comparemela.com


హైదరాబాద్‌కు డి43
హాలీవుడ్‌ సినిమా ‘ద గ్రే మ్యాన్‌’ చిత్రీకరణ నిమిత్తం తమిళ హీరో ధనుష్‌ అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ సైతం మెడికల్‌ చెకప్‌కు అక్కడికి వెళ్లారు. అమెరికా నుంచి ఇండియాకు రాగానే, త్వరలో ధనుష్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారని తెలిసింది. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ఆయనో సినిమా సినిమా చేస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌ ‘డి43’ అని పెట్టారు. జూలై 1 నుంచి హైదరాబాద్‌లో ఆ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం. నెల రోజుల పాటు ధనుష్‌పై భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించనున్నారు. ఇందులో ధనుష్‌ సరసన మాళవికా మోహనన్‌ నటిస్తున్నారు. సముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం ద్వారా ధనుష్‌ త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. 

Related Keywords

United States ,India , ,Man Gray ,Tamil Hero United States ,ஒன்றுபட்டது மாநிலங்களில் ,இந்தியா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.