comparemela.com


దూరంగా ఉన్నా దగ్గరగా..!
ప్రేమంటే..? ఉపోద్ఘాతం వద్దులే కానీ ప్రస్తుతానికి వద్దాం. ఎందుకంటే ఇది కరోనా కాలం కదా! దీని దెబ్బకు దగ్గరగా ఉండాల్సిన జంటలు దూరం జరిగాయి. చేతిలో చెయ్యేసి చెప్పుకొనే ఊసులు... కనులు కనులను పలుకరించుకొనే రోజులు... మాయమయ్యాయి. మరి..! మిగిలిందల్లా అంతులేని విరహం! తట్టుకోలేని తాపం. భౌతిక దూరాలతో ప్రేమ పక్షులు అనుభవిస్తున్న ఈ బాధను అర్థం చేసుకుందో అధ్యయన బృందం. హృదయ స్పందనలను ఒకరికి ఒకరు చేరవేసుకొనేలా ఓ యాప్‌ను తీసుకువచ్చింది. పేరు... ‘సిగ్నిఫికెంట్‌ ఆటర్‌’. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ యాప్‌ స్మార్ట్‌ వాచ్‌లకే పరిమితం. ప్రేమికుల హార్ట్‌ రేట్‌ ఆధారంగా ఇది పని చేస్తుంది. ‘ఎమోజీలు, గిఫ్‌లు, మీమ్స్‌ వంటివి అందుబాటులో ఉన్నా అవి దూరంగా ఉన్నామన్న భావనల్ని పోగొట్టలేకపోతున్నాయి. కానీ ‘సిగ్నిఫికెంట్‌ ఆటర్‌’ ఒకరి గుండె చప్పుడును మరొకరికి వినిపిస్తుంది. దూరంగా ఉన్నా దగ్గరైన అనుభూతిని కలిగిస్తుంది.
ఇందు కోసం ఇరవై జంటలపై ఏడాదికి పైగా జరిపిన పరిశోధనలో మెరుగైన ఫలితాలు వచ్చాయి’ అంటారు ఫానీ ల్యూ. ఈ యాప్‌ని అభివృద్ధి చేసిన ‘సీఎంయూ-శ్నాప్‌ ఇంక్‌’ బృందంలో శాస్త్రవేత్త ఆమె. ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్‌టన్‌’తో కలిసి శ్నాప్‌ ఇంక్‌ దీన్ని రూపొందించింది. ‘అసోసియేషన్‌ ఫర్‌ కంప్యూటింగ్‌ మిషనరీ’ (ఏసీఎం) నిర్వహించిన ‘కంప్యూటర్‌ హ్యూమన్‌ ఇంటరాక్షన్‌ కాన్ఫరెన్స్‌’లో యాప్‌ని ప్రదర్శించారు. జంటలు తమ కోపం, బాధ, ఉత్సుకత, ప్రశాంతత వంటి భావోద్వేగాలకు తగిన యానిమేటెడ్‌ ఆటర్స్‌ను పంపించుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ యాప్‌... హార్ట్‌ రేట్‌ను బట్టి ఎమోషన్స్‌తో కూడిన ఆటర్‌ను ప్రతిపాదిస్తుంది. ఉదాహరణకు హార్ట్‌ బీట్‌ ఫాస్ట్‌గా ఉంటే... కోపం లేదా ఉద్వేగం గల యానిమేటెడ్‌ ఆటర్‌ డిస్‌ప్లే అవుతుంది. అంటే మీ మూడ్‌ను సందేశంగా మలుచుకోవచ్చనమాట. కనుక కరోనా వల్ల ఇళ్లలోనే లాక్‌ అయిపోయామనే బాధ ప్రేమ జంటలకు ఇక అక్కర్లేదంటోంది ఈ యాప్‌ బృందం. 

Related Keywords

Okariki Okaru , ,Annapurna Marriages ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.