comparemela.com


Jagannath ratha gatra:జగన్నాథ రథయాత్ర ప్రారంభం..అమిత్ షా హారతి
అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో భారీ పోలీసు బందోబస్తుర మధ్య జగన్నాథ రథయాత్ర సోమవారం ప్రారంభమైంది. జగన్నాథ రథయాత్ర ప్రారంభం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జగన్నాథ దేవాలయంలో సోమవారం ఉదయం హారతి ఇచ్చారు.అహ్మదాబాద్ జగన్నాథ రథయాత్రలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అహ్మదాబాద్ నగరంలోని జగన్నాథ దేవాలయంలో మంగళ హారతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమిత్ షా అనంతరం గాంధీనగర్ జిల్లా నర్దిపూర్ గ్రామానికి వచ్చి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.కరోనా మార్గదర్శకాలను అమలు చేస్తూ జగన్నాథ రథయాత్రలో మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.ఒడిశా రాష్ట్రంలోని పూరిలోనూ సోమవారం జగన్నాథ రథయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భక్తులు పాల్గొనకుండా రెండు రోజులపాటు పూరి పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

Related Keywords

Orissa ,India ,Ahmedabad ,Gujarat ,Gandhinagar ,Amit Shah Aarti ,Amit Shah ,Amit Shah Jagannath Temple , ,Minister Amit Shah Jagannath Temple Monday ,Ahmedabad Jagannath Puri Amit Shah ,Jagannath Temple Tues Aarti ,Minister Amit Shah ,Gandhinagar District Village ,Jagannath Puri Minister Amit Shah ,Monday Jagannath ,ஓரிஸ்ஸ ,இந்தியா ,அஹமதாபாத் ,குஜராத் ,காந்திநகர் ,அமித் ஷா ,அமைச்சர் அமித் ஷா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.