comparemela.com


140 మంది సిబ్బంది.. లావుగా ఉన్నారని విమానం ఎక్కొద్దన్న ఎయిర్‌లైన్స్
ఇస్లామాబాద్: లావుగా ఉన్నారన్న కారణంగా 140 మంది విమాన సిబ్బందిని విమానాలు ఎక్కకుండా నిషేధం విధించారు. ఈ ఘటన దాయాది దేశం పాకిస్తాన్‌లో వెలుగు చూసింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిలో కొందరు అధిక బరువు ఉన్నారట. ఇలా అధిక బరువు ఉన్న వాళ్లెవరూ విమానం ఎక్కకుండా నిషేధిస్తూ పీఐఏ నిర్ణయం తీసుకుంది. జూలై నెలకు సంబంధించిన ఫ్లైట్స్ డ్యూటీ రోస్టర్‌లో వీళ్ల పేర్లు లేవు. అలాగే పదోన్నతుల జాబితాలో కూడా వీళ్ల పేర్లు తొలగించారట. అయితే ఈ కఠిన నిర్ణయం సడెన్‌గా తీసుకోలేదని పీఐఏ ప్రతినిధులు తెలిపారు. ఇంతకు ముందు పలుమార్లు ఈ అధిక బరువున్న సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశామని, అయినా ఎటువంటి మార్పూ రాకపోవడంతోనే కఠిన నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

Related Keywords

Pakistan ,Islamabad , ,Pakistan International ,பாக்கிஸ்தான் ,இஸ்லாமாபாத் ,பாக்கிஸ்தான் சர்வதேச ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.