దేశంలº ప్రభుత్వ రంగ సంస్థలను మిత్రులకు పంచి పెట్టడమే ధ్యేయంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బ్యాంకులు, బీమా సంస్థలు, రైల్వేలు సహా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లకు ముగింపు పలికేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, దామోదర రాజనర్సింహా, దాసోజు శ్రవణ్, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను ప్రధాని మోదీ ఒకదాని వెంట ఒకటి అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను పంచేస్తున్న మోదీ