vimarsana.com

వ్యవసాయ మార్కెట్లకు రూ.లక్ష కోట్లు

Card image cap


వ్యవసాయ మార్కెట్లకు రూ.లక్ష కోట్లు
ఒక్కో యూనిట్‌కు రూ.2 కోట్ల రుణం.. 3% వడ్డీ రాయితీ
స్వయం సహాయక, రైతు సంఘాలూ వాడుకోవచ్చు
కొబ్బరి బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
ఈనాడు, దిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద సాగు రంగానికి ప్రకటించిన రూ.లక్ష కోట్ల ప్యాకేజీని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో మౌలిక వసతులు పెంచడం కోసం విభిన్న సంఘాలు ఉపయోగించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసినట్లు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, జాతీయ, రాష్ట్ర సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాల సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు ఈ నిధిని ఉపయోగించుకొని రైతులకు అవసరమైన వసతులను అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. ‘‘ఈ పథకం కింద ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వ హామీతో రూ.2 కోట్ల వరకు రుణం అందిస్తాం. 3% వడ్డీ రాయితీ వర్తింపజేస్తాం. ప్రైవేటు రంగంలోని వారు గరిష్ఠంగా విభిన్న గ్రామాల్లో 25 యూనిట్లు చేపట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాలు వికేంద్రీకరణ పద్ధతిలో 25కి మించి యూనిట్లను చేపట్టినా రుణం, వడ్డీ రాయితీ ఇస్తాం. దీని ద్వారా శీతల గిడ్డంగులు, గ్రేడింగ్‌ విభాగాలను ఏర్పాటు చేసుకోవచ్చు’’ అని తోమర్‌ తెలిపారు.
రైతులతో చర్చలకు సిద్ధమే..
ఆందోళనకారులు సాగు చట్టాల రద్దు మినహా ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేర్కొన్నారు.
* కొబ్బరి బోర్డు చట్టంలో సవరణ చేసి కొత్తగా ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌లకు కేంద్ర ప్రభుత్వం తరఫున సభ్యత్వం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా దీనికి ప్రభుత్వేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు.
వైద్య సదుపాయాలకు రూ.23 వేల కోట్ల ప్యాకేజీ
*  కొవిడ్‌ మూడో ఉద్ధృతిని అడ్డుకొనేందుకు వీలుగా దేశంలో వైద్య రంగంలో మౌలిక వసతుల పెంపు కోసం కేంద్రం రూ.23,123 కోట్ల ప్యాకేజీ (కొవిడ్‌ అత్యవసర స్పందన ప్యాకేజీ-2)ని ప్రకటించింది. ఇదివరకు ప్రకటించిన రూ.15వేల కోట్ల ప్యాకేజీకి ఇది అదనం. గురువారం కేబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. కేంద్రం రూ.15వేల కోట్లు, రాష్ట్రాలు రూ.8,123 కోట్లు సమకూర్చనున్నట్లు చెప్పారు.
*  ఈ ప్యాకేజీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఎయిమ్స్‌, ఇతర జాతీయ ప్రాధాన్య వైద్య సంస్థల్లో 6,688 పడకలను కొవిడ్‌ సేవలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి నిధులు ఇస్తారు.
*  736 జిల్లాల్లో చిన్న పిల్లల ఆరోగ్య సంరక్షణ యూనిట్ల ఏర్పాటు. టెలీ ఐసీయూ సేవలు అందించడానికి ప్రతి రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీలు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఎయిమ్స్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ వైద్యసంస్థల్లో పీడియాట్రిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు నెలకొల్పుతారు.
*  ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20వేల ఐసీయూ పడకలు, 2.4 లక్షల సాధారణ పడకలు ఏర్పాటు చేస్తారు. ఇందులో 20% పిల్లలు, పెద్దలు సంయుక్తంగా ఉపయోగించుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దుతారు.
*  ప్రతి జిల్లా కేంద్రంలో 10వేల లీటర్ల ఆక్సిజన్‌ నిల్వ సామర్థ్యం, రూ.కోటి విలువైన అత్యవసర మందుల నిల్వకు నిధులు అందిస్తారు.
*  8,800 కొత్త అంబులెన్సుల ఏర్పాటు.
*  9 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్యాకేజీ ఉపయోగించుకోవచ్చు.
 

Related Keywords

Dilli , Delhi , India , United States , , Center Rs , Prime Minister Modi , Farm Minister Narendra , Central Farm Minister Narendra , Department Minister , டில்லி , டெல்ஹி , இந்தியா , ஒன்றுபட்டது மாநிலங்களில் , ப்ரைம் அமைச்சர் மோடி , துறை அமைச்சர் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.